life at gitam

Feb 17, 2008

రూ.1,00,436 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన

రూ.1,00,436 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రోశయ్య 2008-09 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను శనివారం శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.1,00,436 కోట్లతో ఈ బడ్జెట్ తయారు చేయబడింది. ప్రణాళికా వ్యయం రూ.48.551 కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం 51,885 కోట్లు. ఈ బడ్జెట్‌లో కూడా జలయజ్ఞానికే పెద్దపీట వేశారు. సాగునీటి ప్రాజెక్టులకు మొదటి స్థానం లభించగా, ఇందిరమ్మ ఇళ్లకు రెండో స్థానం కల్పించారు.ఈ బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.17,875 కోట్ల కేటాయించగా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5850 కోట్లు, వ్యయసాయ రంగానికి రూ.2723, గ్రామీణాభివృద్ధికి రూ.3838 కోట్లు, విద్యకు రూ.1771 కోట్లు, సాంఘీక సంక్షేమానికి రూ.1293 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ.450 కోట్లు, బీసీల సంక్షోమానికి రూ.350 కోట్లు, పావలా వడ్డీ పథకానికి రూ.310 కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి రూ.853 కోట్లు కేటాయించారు. వాణిజ్య పన్నుల లక్ష్యం రూ.37,866 కోట్లు కాగా ఇందులో కేంద్ర పన్నుల వాటా రూ.12597 కోట్లు. అంతేకాకుండా ఈ ఏడాది బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఔటర్‌రింగ్ రోడ్డు కోసం రూ.4000 కోట్లు, ఓడరేవుల అభివృద్ధికి రూ.65.34 కోట్లు, ఆహార భద్రత కోసం రూ.30 కోట్లు, మెట్రోరైలు ప్రాజెక్టుకు రూ.150 కోట్లు, విమానాశ్రయాల అభివృద్ధికి రూ.60 కోట్లు, ఏవియేషన్ కార్పొరేషన్‌కు రూ.55 కోట్లు కేటాయించింది.ఇదిలా ఉంటే మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.3116 కోట్లు, అంతర్గత రోడ్ల అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో కొత్తగా 71 ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రోశయ్య తెలిపారు. ధరల నియంత్రణకు నియంత్రణకు రూ.30 కోట్లు, గ్రంథాలయాల అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించామన్నారు. 2015 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.

No comments:

A life time Experience